Breaking News

ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మద్యం ధరల్ని పెంచుతూ ఉత్తర్వులు

ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను మరోసారి పెంచింది. పన్నుల సవరణ పేరిట క్వార్టర్‌ సీసాపై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.20 వరకు ధరలు పెంచుతూ ఎక్సైజ్‌ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.


Published on: 18 Nov 2023 10:57  IST

ఏపీలో మందబాబులకు బ్యాడ్‌న్యూస్.. ప్రభుత్వం మద్యం ధరల్ని పెంచింది. రాష్ట్రంలో వివిధ మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్‌డ్‌ కాంపొనెంట్‌ రూపంలో ప్రస్తుతం విధిస్తున్నఏఆర్‌ఈటీని ( అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని ).. ఇకపైన ఆయా బ్రాండ్ల ధరపై శాతాల రూపంలో వసూలు ఉంటుంది.. వ్యాట్‌, ఏఈడీనీ సవరించింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులిచ్చారు. ఈ సవరణల వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది.

కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు క్వార్టర్‌ సీసా రూ.10-40 వరకూ, హాఫ్‌ బాటిల్‌ రూ.10-50 వరకూ, ఫుల్‌ బాటిల్‌ రూ.10-90 వరకూ పెరిగాయి. మరికొన్ని బ్రాండ్ల ధరలు తగ్గగా.. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ల ధరలు పెరిగాయి. అధికంగా అమ్ముడుపోని, అందుబాటులో లేని బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఐఎంఎఫ్‌ఎల్‌ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది రూ.590కి పెరిగింది. మరో బ్రాండ్‌ క్వార్టర్‌ రూ.200 నుంచి రూ.210కి చేరింది. అయితే కొన్ని రకాల బ్రాండ్ల ధరలు తగ్గాయి.

Follow us on , &

Source From: samayam

ఇవీ చదవండి