Breaking News

నిమిషాల వ్యవధిలో పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలలు ధ్వంసం

పాకిస్థాన్‌తో ఘర్షణ తీవ్రమవుతున్న పరిస్థితుల్లో భారత్‌ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది.


Published on: 12 May 2025 09:58  IST

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న తరుణంలో, భారత రక్షణ దళాలు తీసుకున్న వ్యూహాత్మక చర్యలు శత్రు దేశానికి పెద్ద షాక్‌ ఇచ్చాయి. బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను వినియోగించి పాక్‌ కీలక స్థావరాల లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ చర్యలతో అణ్వాయుధాల గురించి ధీమాగా ఉండే పాకిస్థాన్‌ నాయకత్వం అసహాయ పరిస్థితికి దిగజారినట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్‌ అధికారిక రాజధాని ఇస్లామాబాద్‌ అయినా, కీలక రక్షణ సంబంధిత కార్యాలయాలు రావల్పిండిలోనే ఉన్నాయి. ముఖ్యంగా చక్లాలాలో ఉన్న నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం అత్యంత ప్రాముఖ్యత కలిగినదిగా గుర్తించబడింది. ఇక్కడి నుంచే విమానాలకు ఇంధనం నింపే ట్యాంకర్‌లు, భారీ రవాణా విమానాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.శుక్రవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌ పలుచోట్ల నుంచి భారత్‌పై ఫతాహ్‌-11 బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించగా, భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400 వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. ఇందులో శ్రీనగర్‌ నుంచి నలియా వరకు 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది.

దీకి ప్రతిగా, శనివారం తెల్లవారుజామున భారత వైమానిక దళాలు అధునాతన క్షిపణులు, గైడెడ్‌ బాంబులు, లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ ఉపయోగించి ప్రతిఘటన చేశాయి. ఇందులో బ్రహ్మోస్‌ క్షిపణులు కీలకంగా ఉపయోగించబడ్డాయి. సుఖోయ్‌-30 యుద్ధవిమానాల ద్వారా ఈ క్షిపణులు ప్రయోగించబడి పాకిస్థాన్‌లోని పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దెబ్బతిన్న ప్రధాన స్థావరాల్లో రఫికీ, మురీద్‌, నూర్‌ ఖాన్‌, రహీంయార్‌ ఖాన్‌, సుక్కుర్‌, చునియన్‌, పర్సూర్‌, సియాల్‌కోట్‌ ఉన్నాయి. ఈ కేంద్రాలు పాక్‌ రక్షణ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్నవే. ప్రత్యేకంగా, పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రఫికీ స్థావరం 10,000 అడుగుల రన్‌వే కలిగిన అత్యాధునిక కేంద్రం కాగా, చక్వాల్‌లోని మురీద్‌ వైమానిక స్థావరంలో డ్రోన్లు నిల్వ చేయడం జరుగుతుంది.

భారత్‌ జరిపిన ఈ దాడుల తరువాత పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం కావడంతో, భారత క్షిపణులను గుర్తించలేకపోయారు. దీనితో అక్కడి నాయకత్వం తమ అణ్వాయుధాలను కూడా రక్షించలేనని అర్థమై, వెనకడుగు వేసినట్టు రక్షణ నిపుణులు భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నానికి కాల్పుల విరమణకు సిద్ధమైందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి