Breaking News

టెస్లాకి సవాల్: ఇండియాలో BYD భారీ పెట్టుబడి.. తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్ల ధరలు..?

అమెరికా దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లా త్వరలో ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ తరుణంలో టెస్లాకు ప్రపంచ పోటీదారిగా ఉన్న చైనా కంపెనీ BYD భారతదేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోతోంది.


Published on: 29 Mar 2025 10:16  IST

టెస్లా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ. అయితే, చైనా కంపెనీ BYD ఇప్పుడు టెస్లాను అధిగమించి, ప్రపంచంలో అత్యంత తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే అగ్రగామి సంస్థగా ఎదిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో తన ప్రభావాన్ని చూపిన ఈ రెండు దిగ్గజాలు ఇప్పుడు భారత మార్కెట్‌లో కూడా పోటీకి సిద్ధమయ్యాయి.

ప్రస్తుతం, BYD భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది – ఆటో 3, సీల్, eMax 7. భవిష్యత్తులో మరిన్ని కొత్త మోడళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. తాజాగా, BYD తన తొలి ఎలక్ట్రిక్ కారు "సీలాయన్ 7" మోడల్‌ను లాంచ్ చేసింది. ఇది కాకుండా, మరో కొత్త కార్ల శ్రేణిని కూడా ఇండియాలో ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ మార్కెట్తో సహా ఇండియాలో కూడా తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ క్రమంలోనే, BYD హైదరాబాద్‌లో దాదాపు రూ. 85,000 కోట్ల పెట్టుబడితో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ ఫ్యాక్టరీ, సంవత్సరానికి 6 లక్షల ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో రాబోతోంది. కార్ల తయారీతో పాటు, బ్యాటరీ ఉత్పత్తి కోసం ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని BYD యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, టెస్లా మాత్రమే కాకుండా, టాటా, మహీంద్రా, మారుతి వంటి భారతీయ కంపెనీలకు కూడా BYD గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి