Breaking News

ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..


Published on: 14 Jan 2026 18:16  IST

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అగ్నివీర్‌వాయు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 01. 

  • ఖాళీలు: అగ్నివీర్ వాయు. రాష్ట్రాల వారీగా పోస్టుల కేటాయింపుల మేరకు నియామకాలు చేపడతారు. 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్  సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్/10+2/ సమాన అర్హత కలిగి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో నాన్ ఒకేషనల్ సబ్జెక్టులతో ఒకేషనల్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 
  • వయోపరిమితి: కనీస వయసు:2006,  జనవరి 1న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి
  • గరిష్ట వయస్సు: 2009,  జులై  1న లేదా అంతకు ముందు జన్మించి ఉండాలి. ప్రవేశ తేదీ నాటికి 21 ఏండ్లు మించకూడదు. ఒకవేళ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలోని అన్ని దశలను పూర్తి చేస్తే, ప్రవేశ తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 21 ఏండ్లుగా ఉండాలి.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్ ప్రారంభం: జనవరి 12.
  • అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులందరికీ రూ.649. 
  • లాస్ట్ డేట్: ఫిబ్రవరి 01.
  • సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్–1లో ఆన్​లైన్ టెస్ట్, ఫేజ్–2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్ (పీఎఫ్​టీ–I & ఫీఎఫ్​టీ–II), అడాప్టబిలిటీ టెస్ట్– I (ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష), ఆడాప్టబిలిటీ టెస్ట్–II (ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • ఫేజ్-1 ఆన్​లైన్ ఎగ్జామ్ తేదీ: మార్చి 30, 31.
  • పూర్తి వివరాలకు iafrecruitment.edcil.co.in వెబ్​సైట్​ను సంప్రదించండి. 

Follow us on , &

ఇవీ చదవండి