Breaking News

రైలు ప్రయాణికులకు తాజా అప్‌డేట్ శుక్రవారం నుంచి అమల్లోకి కొత్త టికెట్ ఛార్జీలు

రైలు ప్రయాణికులకు తాజా అప్‌డేట్ శుక్రవారం నుంచి అమల్లోకి కొత్త టికెట్ ఛార్జీలు


Published on: 26 Dec 2025 11:05  IST

భారత రైల్వే శాఖ ప్రతిపాదించిన టికెట్ ఛార్జీల స్వల్ప పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రతి కిలోమీటర్‌కు కేవలం 1 లేదా 2 పైసల మాత్రమే పెంపు చేసినప్పటికీ, ఈ నిర్ణయం సాధారణ ప్రయాణికులపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే సబర్బన్ ప్రయాణికులు, సీజనల్ టికెట్ దారులపై ఎలాంటి భారం పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ఏ రైళ్లకు పెంపు వర్తిస్తుంది?

ఈ కొత్త ఛార్జీలు ప్రధానంగా సాధారణ రైళ్లు, ప్రీమియం రైళ్లకు వర్తిస్తాయి.
అయితే ప్రయాణికులు తరచుగా చెల్లించే

  • రిజర్వేషన్ ఫీజు

  • సూపర్ ఫాస్ట్ చార్జీలు

వీటిలో మాత్రం ఏ మార్పు లేదని రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే ఇప్పటికే జారీ చేసిన టికెట్లపై ఈ పెంపు వర్తించదని కూడా స్పష్టం చేసింది.

సెకండ్ క్లాస్ ఆర్డినరీ ప్రయాణికులకు ఎలా ఉంటుంది?

సెకండ్ క్లాస్ ఆర్డినరీ టికెట్లలో కిలోమీటర్‌కు 1 పైస చొప్పున పెంపు ఉన్నప్పటికీ, ప్రయాణ దూరాన్ని బట్టి కొన్ని స్లాబ్లు నిర్ణయించారు.

  • 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఎలాంటి అదనపు ఛార్జీ లేదు

  • 216 – 750 కి.మీ. వరకు ప్రయాణిస్తే మొత్తం టికెట్‌పై రూ.5 అదనం

  • 751 – 1,250 కి.మీ. దూరానికి రూ.10

  • 1,251 – 1,750 కి.మీ. దూరానికి రూ.15

  • 1,751 – 2,250 కి.మీ. దూరానికి రూ.20

అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం లేకుండా చూడాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తే?

మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే

  • సెకండ్ క్లాస్

  • స్లీపర్ క్లాస్

  • ఏసీ కోచ్‌లు

ప్రయాణికులు మాత్రం ప్రతి కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున ప్రస్తుత టికెట్ ధరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పెంపు కూడా పెద్ద మొత్తంలో కాకుండా స్వల్పంగానే ఉండటంతో ప్రయాణికులపై తీవ్ర ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే…

ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రాకముందే బుక్ చేసిన టికెట్లపై ఎలాంటి పెంపు ఉండదు. శుక్రవారం తర్వాత జారీ అయ్యే టికెట్లకే ఈ మార్పులు వర్తిస్తాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలు వేసుకోవాలని రైల్వే సూచిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి