Breaking News

మహిళపై తెల్లవారుజామున 3 గంటల వరకు కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.

సామూహిక అత్యాచార ఘటనతో కలకలం - పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు - నిందితులను వదలబోమన్న ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్


Published on: 01 Apr 2025 10:21  IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో భక్తురాలిపై దారుణమైన ఘటన జరిగింది. దేవాలయ దర్శనానికి వెళ్లిన 30 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.దాహం వేస్తోంది, మంచినీరు ఇవ్వాలని వేడుకుంటే అమానవీయంగా నిందితులు మూత్రం పోశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం,మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలానికి చెందిన ఈ మహిళ మార్చి 29న బంధువుతో కలిసి ఊర్కొండ మండలంలోని ఆంజనేయస్వామి ఆలయానికి మొక్కులు చెల్లించి నిద్ర చేసేందుకు మధ్యాహ్నం తన బంధువుతో పాటు వెళ్లింది. దైవ దర్శన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భోజనం చేసి, భజన కార్యక్రమంలో పాల్గొన్న. రాత్రి 11.30 గంటల సమయంలో ఆమె మరుగుదొడ్ల వద్దకు వెళ్లగా, అక్కడ తాళం వేసి ఉంది బాధితురాలు తన వెంట వచ్చిన బంధువుతో సమీపంలోని గుట్ట వద్దకు వెళ్తుండగా, ఆలయంలో పనిచేసే ఓ కార్మికుడు గమనించి తన సహచరులకు సమాచారం ఇచ్చాడు.

అంతే ఆలయం సమీపంలో మద్యం సేవిస్తున్న అతడి స్నేహితులు ఆరుగురు ఆమెను అడ్డుకున్నారు. ముందుగా ఆమె బంధువుపై దాడి చేసి చేతులను తాడుతో కట్టేశారు. అనంతరం మద్యం తాగుతూ తెల్లవారుజామున 3 గంటల వరకు పరమ కిరాతకంగా అత్యాచారం చేశారు. ఆమె మెడలోని పుస్తెలతాడు, చెవికమ్మలు కూడా లాక్కొన్నారు. బాధితురాలు ఆ తర్వాత తన శక్తినంతా కూడదీసుకొని బంధువు వద్దకు వచ్చి చేతులకు కట్లు విప్పింది. ఆదివారం (మార్చి 30) ఉదయం 7 గంటలకు ఊర్కొండ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘోర ఘటనపై నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ స్పందిస్తూ, నిందితులను వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ రామేశ్వర్, కల్వకుర్తి సీఐ నాగార్జునలతో కలిసి సోమవారం పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఇప్పటివరకు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఎంతమంది నిందితులు ఉన్నారనే వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి