Breaking News

ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్‌ చేసిన అల్‌ఖైదా


Published on: 03 Jul 2025 11:02  IST

మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఓ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ గురువారం ధ్రువీకరించింది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్‌ నుస్రత్‌ అల్‌ ఇస్లాం వాల్‌ ముస్లిమిన్‌ (JNIM) ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

Follow us on , &

ఇవీ చదవండి