Breaking News

చూస్తుండగా స్టార్ కబడ్డీ ప్లేయర్‌ని కాల్చి చంపారు..


Published on: 16 Dec 2025 18:24  IST

పంజాబ్‌లోని మొహాలీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కబడ్డీ ప్లేయర్, ప్రమోటర్ అయిన రాణా బాలచౌరియాని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. కబడ్డీ టోర్నమెంట్ మధ్యలోనే ప్రేక్షకులు చూస్తుండగా దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. ఈ దారుణ ఘటన వందల మంది ప్రేక్షకుల సమక్షంలో జరగడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. కాగా, ఈ హత్య ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూస్ వాలా హత్యకు ప్రతీకారంగా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి