Breaking News

నిరుద్యోగులను నమ్మించి నయవంచన..


Published on: 03 Feb 2026 16:51  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అన్నారు. మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి యువత ఛీకొడుతోందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలని హామీ అని చెప్పి... ఇప్పుడు ఐదేళ్ల హామీ అంటూ మాటమార్చారంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో మాజీ మంత్రి కేటీఆర్ పోస్టు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి