Breaking News

నేడు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్‌ బంద్‌


Published on: 20 Jun 2025 11:16  IST

మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్‌, భాస్కర్‌ ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే జగన్‌ పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌-ఏపీ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మరోవైపు.. మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది దళసభ్యులు గురువారం భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్‌ ఎదుట లొంగిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి