Breaking News

విమానం తోక‌ను చుట్టేసిన పారాచూట్‌..


Published on: 12 Dec 2025 16:02  IST

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఓ స్కైడైవ‌ర్‌. విమానం తోక భాగంలో వేలాడాడు. కెయిన్స్ ప్రాంతంలో స్కైడైవింగ్ స్టంట్ కోసం చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. విమానం నుంచి డైవింగ్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో.. ఓ స్కైడైవ‌ర్ పారాచూట్ విమానం తోక భాగాన్ని చుట్టేసింది. దీంతో అత‌ను దానికి వేలాడాడు. సుమారు 15 వేల ఫీట్ల ఎత్తులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పారాచూట్ కెమెరా ఆప‌రేట‌ర్ ఈ ఘ‌ట‌న‌ను ఫిల్మ్ తీశాడు. సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన ఈ  వీడియోను ఆస్ట్రేలియా అధికారులు తాజాగా రిలీజ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి