Breaking News

బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తేదీలో మార్పు..


Published on: 16 Dec 2025 14:53  IST

మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈనెల 19న జరగాల్సిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశాన్ని ఈనెల 21కి వాయిదా వేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి