Breaking News

గుడివాడలో దారుణం.. టీడీపీ నేతపై అటాక్..


Published on: 02 Jan 2026 17:33  IST

గుడివాడలోని గుడ్‌మేన్ పేటలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గు‌డ్‌మేన్ పేట సెంటర్‌లో టిడిపి నేత ఇమ్మాన్యూయెల్‌పై కత్తులు, రాళ్లతో మూకుమ్మడి దాడి చేశారు వైసీపీ వర్గీయులు. ఇమ్మాన్యూయెల్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారిపైనా వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇమ్మాన్యూయెల్‌తో సహా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement