Breaking News

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ..


Published on: 27 Jan 2026 15:46  IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఉదయాన్నే ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న లోకేశ్.. పార్లమెంటరీ కమిటీ సభ్యులను స్వయంగా ఆహ్వానించారు. ప్రతి సభ్యుడితో దాదాపు రెండు గంటల పాటు ఓపికగా ఫొటోలు దిగారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి శిక్షణ తరగతులను ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి