Breaking News

జ‌న‌రేటివ్ ఏఐలో ఉద్యోగాల‌ భర్తీ దిశగా యాపిల్..

కొత్త సాంకేతికతకు అనుగుణంగా యాపిల్‌ సంస్థ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఏఐను తమ ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగించుకునే విధంగా యాపిల్‌ సిద్ధమవుతోంది.


Published on: 26 Oct 2023 16:38  IST

ఆధునిక సాంకేతిక విప్లవం ఏఐ(Generative AI Roles)ను త‌మ ఉత్పత్తుల్లో వీలైనంత అధికంగా వినియోగించుకునే దిశగా టెక్ దిగ్గ‌జం యాపిల్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో.. ఏఐకి సంబంధించి ప‌లు జాబ్ లిస్టింగ్స్‌ను యాపిల్ సంస్థ పోస్ట్ చేసింది. త‌మ డివైజ్‌లు, సాఫ్ట్‌వేర్‌లో ఏఐ టెక్నాల‌జీని జోడించేందుకు యాపిల్ క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని.. ప‌లు ఏఐ రోల్స్ కోసం హైరింగ్‌ను చేప‌డుతోందని అర్థమవుతోంది. ట్రాన్స్‌ఫార్మ‌ర్ మోడ‌ల్‌గా పిలిచే టెక్నాల‌జీ ఆధారంగా ఐఓఎస్ 17కు యాపిల్ ఇటీవ‌లే న్యూ ఆటోకరెక్ట్ ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే.

యాపిల్ డివైజ్‌లలో ఆటోక‌రెక్ట్ క‌చ్చిత‌త్వాన్ని మెరుగుప‌రిచేందుకు ఈ టెక్నాల‌జీ ఏఐని వినియోగిస్తోంది. త‌మ ఉత్ప‌త్తుల మెరుగుద‌ల‌కు యాపిల్ ఏఐపై పెద్ద‌మొత్తంలో పెట్టుబ‌డులు పెడుతుంద‌నేందుకు ఇవే సంకేతాలుగా నిపుణులు భావిస్తున్నారు. యాప్ డెవ‌ల‌ప‌ర్స్ మెరుగైన యాప్స్ త‌యారుచేసేలా జ‌న‌రేటివ్ ఏఐ సిస్ట‌మ్ వారికి సాయ‌ప‌డేలా యాపిల్ ఏఐ సిస్ట‌మ్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. వాయిస్‌, చాట్ వాడుతూ క‌స్ట‌మ‌ర్స్‌తో మాట్లాడేలా సిస్ట‌మ్‌ను నిర్మించే వ్య‌క్తుల కోసం కూడా యాపిల్ అన్వేషిస్తోంది. సుదీర్ఘ టెక్ట్స్ రాయ‌డం, ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌డం వంటి ప‌నుల కోసం టెక్ట్స్ టెక్నాల‌జీపైనా యాపిల్ క‌స‌ర‌త్తు సాగిస్తోంది. ఇక జ‌న‌రేటివ్ ఏఐ ఉత్ప‌త్తులు, ఫీచ‌ర్ల అభివృద్ధి కోసం యాపిల్ ఏటా రూ. 8000 కోట్లు పైగా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Follow us on , &

Source From: samayam

ఇవీ చదవండి