Breaking News

ChatGPT | ఏఐతో మాన‌వాళి అంత‌రించిపోతుంది : టెక్ దిగ్గ‌జాల వార్నింగ్

చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తున్న క్ర‌మంలో ఏఐపై టెక్ ప్ర‌పంచంలో విస్తృత చ‌ర్చ సాగుతోంది.


Published on: 01 Jun 2023 15:30  IST

న్యూయార్క్ : చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తున్న క్ర‌మంలో ఏఐపై టెక్ ప్ర‌పంచంలో విస్తృత చ‌ర్చ సాగుతోంది. ఏఐతో కొలువుల కోత త‌ప్ప‌ద‌నే ఆందోళ‌న నెల‌కొన్న క్ర‌మంలో ఏఐ విప‌రిమాణాల‌పైనా గుబులు రేగుతోంది. ఏఐతో మాన‌వాళికి ముప్పు తప్ప‌ద‌ని టెక్ దిగ్గ‌జాలు హెచ్చ‌రిస్తుండ‌గా తాజాగా చాట్‌జీపీటీ సృష్టిక‌ర్త శామ్ అల్ట్‌మ‌న్ సైతం ఏఐపై బాంబు పేల్చారు.

ఓపెన్ఏఐ వ్య‌వ‌స్ధాప‌కులు అల్ట్‌మ‌న్‌, మైక్రోసాఫ్ట్ సీటీవో కెవిన్ స్కాట్ వంటి టెకీలు ఏఐ స‌మాజానికి పెనుముప్పుగా ప‌రిణ‌మిస్తుంద‌ని హెచ్చ‌రించారు. మ‌హమ్మారులు, అణు యుద్ధాలు మాన‌వాళికి ఎలాంటి విధ్వంసాన్ని మిగుల్చుతాయో ఏఐ కూడా అలాంటి ముప్పేన‌ని స్ప‌ష్టం చేశారు. ఏఐని నియంత్రించాల‌ని, ఇది మాన‌వాళి ముందుంచే ముప్పుల‌ను ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధం కావాల‌ని కోరుతూ సెంట‌ర్ ఫ‌ర్ ఏఐ సేఫ్టీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌నపై పెద్ద‌సంఖ్య‌లో ఎగ్జిక్యూటివ్‌లు, విద్యావేత్త‌లు సంత‌కాలు చేశారు.

జాబ్ మార్కెట్ల‌కు ఏఐ పెను విఘాతం క‌లిగిస్తుంద‌ని, ప్రజారోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావం క‌లిగిస్తుంద‌ని ఈ ప్ర‌క‌ట‌న ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. కాగా, ఏఐ మాన‌వాళికి స‌వాల్‌గా మారుతుంద‌నే ఆందోళ‌న‌తో ప్ర‌ముఖ టెక్ నిపుణులు జెఫ్రీ హింట‌న్ ఇటీవ‌ల గూగుల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి