Breaking News

ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం లెనోవో సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అల్ట్రాస్లిమ్‌ సోలార్‌ పవర్‌ ఆధారిత ల్యాప్‌టాప్‌ను అభివృద్ధి చేసింది.

ఈ యోగా సోలార్‌ పీసీ చూడ్డానికి రెగ్యులర్‌ ల్యాప్‌ట్యాప్‌లానే ఉంటుంది. కానీ వెనక ఉన్న బ్యాక్‌ ప్యానెల్‌ సోలార్‌ పవర్‌ని సంగ్రహించేందుకు సోలార్‌ ప్యానెల్‌లా పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఇండోర్ ప్రదేశాల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో కుడా పని చేస్తుంది.


Published on: 19 Mar 2025 11:40  IST

ఈ Yoga Solar PC Concept ల్యాప్‌టాప్‌లో 24 శాతం కంటే ఎక్కువ సౌరశక్తిని సమర్థవంతంగా మార్చగల సోలార్ ప్యానెల్ ఉంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను సూర్యకాంతి ఉపయోగించి ఛార్జ్ చేయొచ్చు. ఎండలో కేవలం 20 నిమిషాల ఉంచితే గంట సేపు వీడియోను ప్లే బ్యాక్‌ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్‌ పనిచేస్తుంది. లెనోవా నుంచి వచ్చిన ఈ సౌరశక్తితో పనిచేసే ఈ పర్సనల్‌ కంప్యూటర్‌ బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని బరువు కేవలం 1.22 కిలోలు మాత్రమే. దీని మందం కేవలం 15 మిమీ. దీంతో ఈ ల్యాప్‌టాప్ చాలా సన్నగా, తేలికగా ఉండటంతో దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా ఉంటుంది.

‘యోగా సోలార్‌ పీసీ’గా పిలుస్తున్న దీన్ని 20 నిమిషాల పాటు సోలార్‌ చార్జింగ్‌ చేస్తే సుమారు గంట పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో సోలార్‌ ఆధారిత టెక్నాలజీకి ఇది ఊతమివ్వనున్నది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ‘మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌’లో దీన్ని లెనోవో ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే మొదటి అల్ట్రాస్లిమ్‌ సోలార్‌ పీసీగా ఆ కంపెనీ అభివర్ణించింది.

 

Follow us on , &

ఇవీ చదవండి