Breaking News

తెలంగాణలో ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్న కమలం పార్టీ.. ఇప్పుడు ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను కూడా విడుదల చేసింది. అయితే ఈ ఆరుగురు అభ్యర్థుల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలే కావటం గమనార్హం. మిగితా స్థానాలకు కూడా పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.


Published on: 26 Feb 2024 16:57  IST

ప్రస్తుతం ప్రకటించిన ఆరుగురు అభ్యర్థుల్లో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌‌కు మరోసారి అవకాశం ఇచ్చింది. కాగా.. సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌ రెడ్డి , కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్ మరోసారి ఎంపీలుగా బరిలోకి దిగనున్నారు. వీళ్లతో పాటు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్‌కు బీజేపీ అధిష్ఠానం టికెట్లు ఖరారులు చేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో పార్లమెంటు ఎన్నికల్లో 10కిపైగా స్థానాలు దక్కించుకునేందుకు ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి