Breaking News

కంటైనర్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

యాదాద్రి భువనగిరి జిల్లా  చౌటుప్పల్ సమీపంలోని కైతాపురం వద్ద శనివారం (31 జనవరి 2026) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 


Published on: 31 Jan 2026 10:16  IST

యాదాద్రి భువనగిరి జిల్లా  చౌటుప్పల్ సమీపంలోని కైతాపురం వద్ద శనివారం (31 జనవరి 2026) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65పై వేగంగా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్, ముందున్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ఢీకొన్న ధాటికి ఆయిల్ ట్యాంకర్ ముందు భాగం (క్యాబిన్) పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్ సుమారు అరగంటకు పైగా క్యాబిన్‌లోనే చిక్కుకుపోయాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం వల్ల విజయవాడ - హైదరాబాద్ హైవేపై సుమారు 4 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ల సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి