Breaking News

భూదాన్ పోచంపల్లిలో బంగారంతో దొంగ పరార్

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో సోమవారం (ఫిబ్రవరి 9, 2026) సంతానం పేరుతో ఒక దొంగ దంపతులను మోసగించి బంగారంతో ఉడాయించాడు.


Published on: 09 Feb 2026 19:00  IST

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో సోమవారం (ఫిబ్రవరి 9, 2026) సంతానం పేరుతో ఒక దొంగ దంపతులను మోసగించి బంగారంతో ఉడాయించాడు. తాను కేరళకు చెందిన యునానీ వైద్యుడినని పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, సంతానం లేని ప్రణీత, రాజు అనే దంపతులను కలిశాడు. 40 రోజులు మందు వాడితే సంతానం కలుగుతుందని, ఇందుకు రూ. 12,000 ఖర్చవుతుందని నమ్మబలికాడు.

మందు తయారీకి కొన్ని వస్తువులు కావాలని చిట్టీ రాసి ఇచ్చి, బాదంతో పాటు ఆ వస్తువులు తీసుకురమ్మని భర్త రాజును బయటకు పంపాడు.మందు సరిగ్గా పనిచేయాలంటే ఒంటిపై బంగారు నగలు ఉండకూడదని నమ్మించి, ప్రణీత మెడలోని నాలుగు తులాల పుస్తెలతాడును తీయించి బెడ్ మీద పెట్టించాడు. ఆమెకు ఒక తైలం ఇచ్చి ఒంటికి రాసుకుని స్నానం చేసి రమ్మని చెప్పాడు. ఆమె లోపలికి వెళ్లగానే నగలతో పరారయ్యాడు.బాధితులు డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి