Breaking News

విద్యార్థిని పట్ల హెడ్ మాస్టర్ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఒక ప్రైవేట్ పాఠశాల హెడ్మాస్టర్‌ను విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు.


Published on: 10 Feb 2026 12:23  IST

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఒక ప్రైవేట్ పాఠశాల హెడ్మాస్టర్‌ను విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గిరిగుట్టలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పదవ తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థినితో గత కొంతకాలంగా సదరు హెడ్మాస్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఉపాధ్యాయుడు పాఠశాల ఆవరణలోనే విద్యార్థినితో బలవంతంగా "పెళ్లి" చేసుకున్నాడని, ఆమె మెడలో మంగళసూత్రం ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించగా ఈ విషయం బయటపడిందని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతనిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి