Breaking News

హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్

చాహత్ బాజ్‌పాయ్ (Chahat Bajpai, IAS)హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి 26న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. 


Published on: 28 Feb 2026 17:41  IST

చాహత్ బాజ్పాయ్ హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి 26న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. 

ఆమె అంతకుముందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కమిషనర్‌గా ఉండేవారు.కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, GWMC కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు.ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్‌గా ఉన్న స్నేహ శబరీష్  మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే సందర్భంగా భద్రకాళి బండ్ వద్ద జరిగిన 'రుద్రమ వి1' రాకెట్ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు.

Follow us on , &

ఇవీ చదవండి