Breaking News

తెలంగాణలో రేపటి నుండి పదో తరగతి పరీక్షలు

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుండి (మార్చి 14, 2026) పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) రేణుకా దేవి గారు జిల్లాలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 

Published on: 13 Mar 2026 15:27  IST

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుండి (మార్చి 14, 2026) పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) రేణుకా దేవి గారు జిల్లాలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 

ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందుగా (ఉదయం 9:00 గంటలకు) పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఉదయం 9:35 గంటల వరకు మాత్రమే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా TG SSC హాల్ టికెట్ 2026 డౌన్‌లోడ్ లింక్ ద్వారా పొందవచ్చు.జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు మరియు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 

Follow us on , &

ఇవీ చదవండి