Breaking News

కాజీపేటలో తండ్రీకూతుళ్లు సజీవ దహనం  

హన్మకొండ జిల్లా కాజీపేట  మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప సముదాయంలో బుధవారం (మార్చి 18, 2026) వేకువజామున తండ్రీకూతుళ్లు సజీవ దహనమైన విషాద ఘటన చోటుచేసుకుంది. 


Published on: 18 Mar 2026 10:11  IST

హన్మకొండ జిల్లా కాజీపేట  మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప సముదాయంలో బుధవారం (మార్చి 18, 2026) వేకువజామున తండ్రీకూతుళ్లు సజీవ దహనమైన విషాద ఘటన చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంలో తండ్రి రాజశేఖర్ (54), ఆయన కుమార్తె రాజశ్రీ (24) మృతి చెందారు.బుధవారం వేకువజామున సుమారు నాలుగు గంటల సమయంలో తండ్రి రాజశేఖర్ ఒంటికి మంటలు అంటుకున్నాయి. అది గమనించిన కుమార్తె రాజశ్రీ ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నించగా, ఆమెకు కూడా తీవ్రంగా మంటలు అంటుకొని ఇద్దరూ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.ఘటన సమయంలో రాజశ్రీ భర్త ప్రవీణ్ తన పిల్లలతో కలిసి ఇంటి బయటకు వచ్చి స్థానికులను అప్రమత్తం చేశారు.

మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. తండ్రి మరణం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి