Breaking News

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు సోమవారం (మార్చి 23, 2026) నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 


Published on: 23 Mar 2026 14:13  IST

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని, కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యవహారంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి మరియు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు హైకోర్టు నోటీసులు పంపింది.నోటీసు అందిన నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 16, 2026కు వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి