Breaking News

పెద్దపల్లిలో విద్యుదాఘాతంతో ఒక బాలుడు మృతి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కటికెనపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ఒక బాలుడు మృతి చెందాడు.


Published on: 24 Mar 2026 14:15  IST

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కటికెనపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ఒక బాలుడు మృతి చెందాడు.బొజ్జ అభిరామ్ (6 ఏళ్లు) తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అన్నం తిన్న తర్వాత, పక్కనే ఉన్న బల్ల కుమార్ అనే వ్యక్తి ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు.

ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ ఇంటి మెట్ల కింద ఉన్న ఎర్త్ వైర్‌ను బాలుడి కుడి చేయి తాకింది. దీనివల్ల తీవ్రమైన కరెంట్ షాక్‌కు గురై బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.బాలుడి తండ్రి బొజ్జ సంపత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి