Breaking News

హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ

2026 మార్చి 25న హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఇంధనం కొరత ఉందనే పుకార్లు మరియు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయనే భయంతో ప్రజలు బంకులకు పరుగులు తీశారు. 

Published on: 25 Mar 2026 10:15  IST

2026 మార్చి 25న హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఇంధనం కొరత ఉందనే పుకార్లు మరియు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయనే భయంతో ప్రజలు బంకులకు పరుగులు తీశారు. 

నగరంలోని బంజారాహిల్స్, బేగంపేట్, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, ఆల్వాల్, అత్తాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో, కొన్ని బంకుల్లో "నో స్టాక్" బోర్డులు పెట్టారు, ఇది ప్రజల్లో మరింత ఆందోళనను పెంచింది.

సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, పెట్రోల్ కొరత లేదని, పుకార్లను నమ్మవద్దని, ఆందోళనతో పెట్రోల్ నింపుకోవద్దని (Panic Buying) కోరారు.వాహనాల రద్దీ కారణంగా పెట్రోల్ బంకుల పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. 

Follow us on , &

ఇవీ చదవండి