Breaking News

శ్రీకృష్ణ కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

నేడు, 2026 మార్చి 28 శనివారం ఉదయం, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని శ్రీకృష్ణ కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.


Published on: 28 Mar 2026 14:14  IST

నేడు, 2026 మార్చి 28 శనివారం ఉదయం, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని శ్రీకృష్ణ కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం ఎక్కువ వాటిల్లింది. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ పత్తి మిల్లు.ప్రభుత్వం (CCI) రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేసిన సుమారు 21,000 పత్తి బేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, మిల్లుకు విద్యుత్ సరఫరా లేదని అధికారులు పేర్కొన్నారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ఈ ఘటనపై వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి