Breaking News

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టు

మార్చి 30, 2026 (సోమవారం) నాడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.


Published on: 30 Mar 2026 15:41  IST

మార్చి 30, 2026 (సోమవారం) నాడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ సంఘాలు ఈ నిరసనకు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనంతుల మధుతో పాటు నాయకులు భాషిపంగు సునీల్, ఏనిగా సంతోష్ రెడ్డి, భూక్యా నాగు నాయక్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి పి. వెంకటరామ్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు మరియు వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఎండి ఖాజాపాషా (కేపి)లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఉద్యమకారుల గుర్తింపు కోసం చట్టపరమైన సబ్ కమిటీ వేయాలని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని మరియు ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదని, శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని ఉద్యమకారులు పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి