Breaking News

జలవిహార్‌ పార్కులో ఆర్‌వోప్లాంట్‌ పేలుడు ఘటన

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌వాటర్ పార్కులో జరిగిన ఆర్‌వో (RO) ప్లాంట్‌ పేలుడు ఘటనలో గాయపడిన ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. 


Published on: 09 Apr 2026 16:26  IST

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌వాటర్ పార్కులో జరిగిన ఆర్‌వో (RO) ప్లాంట్‌ పేలుడు ఘటనలో గాయపడిన ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన గంగులయ్య (అలియాస్ లక్ష్మణ్) (50) చికిత్స పొందుతూ మరణించారు.బుధవారం (ఏప్రిల్ 8, 2026) సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఆర్‌వో ప్లాంట్ వద్ద వాటర్ ట్యాంకును శుభ్రం చేసే క్రమంలో, ఒక కెమికల్ డబ్బాను తెరిచేందుకు గోడకు కొట్టడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఫిల్టర్లు లేదా కంప్రెషర్‌లో అధిక పీడనం (High Pressure) ఏర్పడటం వల్ల కూడా పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో అప్పుల నాయుడు, అంజి అనే మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై లేక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి