Breaking News

చంచల్‌గూడ జైలులో ఫిట్స్‌తో ఖైదీ మృతి

చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉన్న బానావత్‌ రాందాస్‌ ఫిట్స్‌ (వ్యాధి) రావడంతో మంగళవారం (ఏప్రిల్ 14, 2026) రాత్రి మృతి చెందారు.


Published on: 15 Apr 2026 13:53  IST

చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉన్న బానావత్‌ రాందాస్‌ ఫిట్స్‌ (వ్యాధి) రావడంతో మంగళవారం (ఏప్రిల్ 14, 2026) రాత్రి మృతి చెందారు. బానావత్‌ రాందాస్‌, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం పులుగోనిపల్లి తండాకు చెందిన వ్యక్తి.గత నెల మార్చి 31న తన భార్య కవిత (28) మరియు కుమారుడు హర్షరోహిత్‌లను రోకలి బండతో కొట్టి చంపిన కేసులో రాందాస్‌ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌ నిమిత్తం తరలించారు.

సోమవారం రాత్రి జైలులో అతనికి అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు ఈ మరణవార్తను ధ్రువీకరించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి