Breaking News

ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో ఏసీ షార్ట్ సర్క్యూట్

హైదరాబాద్‌లోని మైత్రీవనం చౌరస్తా సమీపంలో గల ఆదిత్య ఎన్‌క్లేవ్ (Aditya Enclave) భవనంలో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుండి పెను ముప్పు తృటిలో తప్పింది. 

Published on: 17 Apr 2026 14:56  IST

హైదరాబాద్‌లోని మైత్రీవనం చౌరస్తా సమీపంలో గల ఆదిత్య ఎన్‌క్లేవ్ (Aditya Enclave) భవనంలో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుండి పెను ముప్పు తృటిలో తప్పింది. 

భవనంలోని ఒక కార్యాలయంలో ఏసీ యూనిట్ నుండి ఒక్కసారిగా మంటలు మరియు దట్టమైన పొగలు వెలువడ్డాయి.మంటలు గమనించిన వెంటనే అక్కడున్న వారు అప్రమత్తమై బయటకు రావడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీలో మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి