Breaking News

ఏటీఎం కేంద్రంలో వ్యక్తి మృతదేహం కలకలం

హైదరాబాద్‌లోని విజయనగర్ కాలనీలో ఉన్న ఒక ఏటీఎం కేంద్రంలో 23 ఏప్రిల్ 2026న ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది.


Published on: 23 Apr 2026 18:07  IST

హైదరాబాద్‌లోని విజయనగర్ కాలనీలో ఉన్న ఒక ఏటీఎం కేంద్రంలో 23 ఏప్రిల్ 2026న ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. . మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో ఉన్న HDFC బ్యాంక్ ఏటీఎం.ఏటీఎంలో మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఏటీఎం తలుపులు తెరిచి పరిశీలించారు.

సదరు వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లిన తర్వాత లోపలి నుంచి తలుపు లాక్ అయిపోయి ఉండవచ్చని, ఊపిరి ఆడకపోవడం (suffocation) వల్ల అతను మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి