Breaking News

భోలక్‌పూర్లో ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్‌పూర్లో గల ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్/గోదాంలో మే 4, 2026తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.


Published on: 04 May 2026 18:25  IST

హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్పూర్లో గల ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్/గోదాంలో మే 4, 2026తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ప్లాస్టిక్ గోదాంలో మొదలైన మంటలు వేగంగా పక్కనే ఉన్న మరో రెండు గోదాములకు, సుమారు ఐదు ఇళ్లకు విస్తరించాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సుమారు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, పొగ పీల్చడం వల్ల గోదాం లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు; వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి