Breaking News

తొర్రూరులో తొమ్మిది తులాల బంగారం చోరీ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో 2026 మే 14 (గురువారం) అర్ధరాత్రి దొంగలు ఘోర దారుణానికి పాల్పడ్డారు.


Published on: 15 May 2026 15:51  IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో 2026 మే 14 (గురువారం) అర్ధరాత్రి దొంగలు ఘోర దారుణానికి పాల్పడ్డారు. గ్రామంలో ఆరుబయట నిద్రిస్తున్న మహిళల మెడల్లోంచి సుమారు ఎనిమిది నుండి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు.

మే 14 అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగింది.నల్లటి దుస్తులు ధరించి, ముఖాలకు మాస్కులు మరియు చేతులకు గ్లౌజులు వేసుకున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దొంగతనానికి ఒడిగట్టారు.

దుండగులు ముందుగా గ్రామం చివర ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఆరుబయట నిద్రిస్తున్న మహిళల మెడల నుంచి బంగారాన్ని లాక్కొని పారిపోయారు.దొంగలు అదే గ్రామానికి చెందిన తండా లింగమూర్తి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించగా, కుక్కలు మొరగడంతో ఆయన మేల్కొని కేకలు వేశారు. దీనితో దొంగలు పొలాల వైపు పారిపోయారు

Follow us on , &

ఇవీ చదవండి