Breaking News

వరంగల్లో గిర్నిబావి స్టేజి వద్ద ఘోర రోడ్డుప్రమాదం

మంగళవారం (19 మే 2026) తెల్లవారుజామున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి స్టేజి వద్ద కారు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.


Published on: 19 May 2026 17:13  IST

మంగళవారం (19 మే 2026) తెల్లవారుజామున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి స్టేజి వద్ద కారు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.ప్రమాదంలో మరణించిన వ్యక్తిని వరంగల్‌లోని కాశీబుగ్గ (20వ డివిజన్, పద్మానగర్) ప్రాంతానికి చెందిన వరుణ్ (31) గా గుర్తించారు.వరుణ్ తన కారులో వరంగల్ నుండి నర్సంపేట వైపు వెళ్తుండగా, నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై గిర్నిబావి స్టేజి వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, చికిత్స కోసం వరంగల్‌లోని MGM ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న దుగ్గొండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి