Breaking News

నిజామాబాద్లో పద్మానగర్‌ ఏరియాలో చోరీలు

నిజామాబాద్ నగరంలో పద్మానగర్‌ ఏరియాలో వరుస దొంగతనాలు జరిగాయి. నగరంలో తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు ఇళ్ల తలుపులు తెరిచి లేదా ఆరుబయట నిద్రపోతుండటాన్ని ఆసరాగా చేసుకుని ఒక దొంగ వరుసగా ఇళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డాడు.


Published on: 28 May 2026 15:49  IST

నిజామాబాద్ నగరంలో పద్మానగర్ఏరియాలో వరుస దొంగతనాలు జరిగాయి. నగరంలో తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు ఇళ్ల తలుపులు తెరిచి లేదా ఆరుబయట నిద్రపోతుండటాన్ని ఆసరాగా చేసుకుని ఒక దొంగ వరుసగా ఇళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డాడు.

నిజామాబాద్ నగరంలోని పద్మానగర్ రోడ్ నంబర్ 2, 3 పరిధిలో.రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం కలగడం మరియు తీవ్రమైన వేడి కారణంగా స్థానికులు తలుపులు తెరిచి నిద్రించారు.ఒకే రాత్రి దొంగ వరుసగా నాలుగు ఇళ్లలోకి చొరబడ్డాడు.

ఒక ఇంట్లో రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, మరో ఇంట్లో 3 గ్రాముల గొలుసుతో పాటు మొత్తం ఇళ్లలో కలిపి వేలల్లో నగదును దొంగిలించాడు.చివరి ఇంట్లో చొరబడిన సమయంలో అక్కడున్న వృద్ధ దంపతులను కత్తితో బెదిరించి నగదు లాక్కున్నాడు. వారి కేకలతో స్థానికులు వెంబడించినప్పటికీ దొంగ తప్పించుకున్నాడు.

నిజామాబాద్ ఫోర్త్ టౌన్ (నాలుగో ఠాణా) పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి, స్థానిక సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి