Breaking News

భార్యను హతమార్చి పీఎస్లో లొంగిపోయిన భర్త

హైదరాబాద్‌లోని మూసాపేట్ కైతలాపూర్‌లో ఘోర విపత్తు జరిగింది; కుటుంబ కలహాల కారణంగా భార్యను హతమార్చిన భర్త కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లోంగిపోయాడు.మృతురాలిని అస్మారా బేగం (24)గా గుర్తించారు.


Published on: 04 Jun 2026 18:58  IST

హైదరాబాద్‌లోని మూసాపేట్ కైతలాపూర్‌లో ఘోర విపత్తు జరిగింది; కుటుంబ కలహాల కారణంగా భార్యను హతమార్చిన భర్త కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లోంగిపోయాడు.మృతురాలిని అస్మారా బేగం (24)గా గుర్తించారు.ఆమె భర్త షేక్ రహీమ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.వీరు మూసాపేట్ పరిధిలోని కైతలాపూర్ ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నారు.

షేక్ రహీమ్, అస్మారా బేగంలకు 2024 లో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. పెళ్లయినప్పటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ విషయమై ఇద్దరూ గతంలో పోలీసులకు విడివిడిగా ఫిర్యాదులు కూడా చేశారు.

జూన్ 4 (గురువారం) ఉదయం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన రహీమ్, కత్తితో భార్య అస్మారా బేగం గొంతు కోసి కిరాతకంగా చంపేశాడు.భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు రహీమ్ నేరుగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లోంగిపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి