Breaking News

ఎస్ఐ ఖాతా నుండి డబ్బు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI)గా పనిచేస్తున్న నరసయ్య సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి తన ఖాతా నుండి డబ్బు కోల్పోయారు.


Published on: 11 Jun 2026 17:19  IST

హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI)గా పనిచేస్తున్న నరసయ్య సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి తన ఖాతా నుండి డబ్బు కోల్పోయారు.సైబర్ కేటుగాళ్లు ఏఎస్సై నరసయ్య మొబైల్‌కు RTA (రవాణా శాఖ) చలాన్ పేరుతో ఒక మెసేజ్ పంపించారు.ఆ మెసేజ్‌తో పాటు ఒక ప్రమాదకరమైన APK ఫైల్ లింక్‌ను జత చేశారు. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే అది ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యి, ఆయన బ్యాంకింగ్ వివరాలను నేరగాళ్లకు చేరవేసింది.జూన్ 8వ తేదీన ఆయన మొబైల్‌కు వరుసగా మెసేజ్‌లు రావడంతో గమనించగా, ఆయన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతా నుండి రూ. 49,139 కట్ అయినట్లు గుర్తించారు.

మోసపోయానని గ్రహించిన వెంటనే ఏఎస్సై నరసయ్య సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు.ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

చలానాల పేరుతో వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్‌లలో వచ్చే ఎలాంటి అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దు.ఫోన్లలో అనధికారిక APK ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయకూడదు.అధికారిక చలాన్ల చెల్లింపుల కోసం ఎల్లప్పుడూ తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ ఈ-చలాన్ వెబ్‌సైట్ లేదా ప్రభుత్వ రవాణా శాఖ యాప్‌లను మాత్రమే వాడాలి.

 

Follow us on , &

ఇవీ చదవండి