Breaking News

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం ఒకరు మృతి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారు లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Published on: 15 Jun 2026 17:48  IST

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారు లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘట్‌కేసర్ నుండి కీసర వైపు వెళ్తుండగా రాంపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు ప్రయాణిస్తున్న కారు (SUV) వేగంగా వెళ్లి ముందర వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి