Breaking News

ఫిల్మ్‌నగర్‌లో యువతిపై సహోద్యోగి అత్యాచారం

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్‌నగర్‌లో ఒక యువతిపై ఆమె సహోద్యోగి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో నివసించే ఒక యువతి ప్రైవేట్ కార్యాలయంలో పని చేస్తోంది.


Published on: 26 Jun 2026 16:18  IST

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్నగర్లో ఒక యువతిపై ఆమె సహోద్యోగి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో నివసించే ఒక యువతి ప్రైవేట్ కార్యాలయంలో పని చేస్తోంది. ఫిబ్రవరి 19న జరిగిన తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా తనతో పాటు పనిచేసే సహోద్యోగులైన అభినయ్, వంశీలను ఆమె తన ఇంటికి ఆహ్వానించింది.

వేడుక ముగిసిన తర్వాత వారు మద్యం సేవించారు. అయితే అభినయ్, వంశీ ఇద్దరూ దూర ప్రాంతాలలో నివసిస్తుండటంతో, ఆ రాత్రికి యువతి ఇంట్లోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు.

అర్ధరాత్రి సమయంలో బాధితురాలు నిద్రిస్తుండగా, నిందితుడు అభినయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 21న కూడా అతడు మరోసారి ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు.ఫిబ్రవరి 23వ తేదీన అభినయ్, వంశీ ఇద్దరూ కలిసి మళ్లీ బాధితురాలి ఫ్లాట్ వద్దకు వచ్చి తలుపులను బలంగా కొడుతూ గొడవకు దిగారు.

పోలీసుల చర్యలు:
బాధితురాలు జరిగిన దారుణంపై ధైర్యంగా బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement