Breaking News

ఎస్ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

కరీంనగర్‌లో విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్‌ఐ (SFI) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా మరియు ర్యాలీ జరిగింది.రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా, ఈ ఆందోళన కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు.


Published on: 06 Jul 2026 19:46  IST

కరీంనగర్‌లో విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్‌ఐ (SFI) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా మరియు ర్యాలీ జరిగింది.రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా, ఈ ఆందోళన కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. ఎస్ఎఫ్‌ఐ జిల్లా కమిటీ నేతృత్వంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.విద్యార్థులు మరియు ఎస్ఎఫ్‌ఐ నాయకులు మొదట నగరంలోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా తరలివచ్చారు.

కలెక్టరేట్ కార్యాలయం ముందుకు చేరుకున్న విద్యార్థులు అక్కడే రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా నిర్వహించారు. దీనివల్ల అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

ఎస్ఎఫ్‌ఐ ప్రధాన డిమాండ్లు

ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కల్పించాలి.విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

పాఠ్యపుస్తకాలు & యూనిఫాంలు: విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో అందని పుస్తకాలను, యూనిఫాంలను వెంటనే పంపిణీ చేయాలి.

విద్యాశాఖ మంత్రి నియామకం: విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ కుంటుపడుతోందని, తక్షణమే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.

పోస్టుల భర్తీ: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులతో పాటు MEO పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.

ఫీజుల నియంత్రణ: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు కఠినమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి.

Follow us on , &

ఇవీ చదవండి