Breaking News

సిమెంట్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా ఇద్దరు మృతి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ – డబ్బా ప్రధాన రహదారిపై ఉన్న ఒక మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.


Published on: 08 Jul 2026 16:53  IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.చింతలమానేపల్లి మండలం బాబాసాగర్డబ్బా ప్రధాన రహదారిపై ఉన్న ఒక మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.కెరమెరి మండలానికి చెందిన ఎనిమిది మంది కూలీలు ట్రాక్టర్‌లో సిమెంట్ ఫెన్సింగ్ స్తంభాలను (పోల్స్) లోడ్ చేసుకుని కర్జవెల్లి ఫారెస్ట్ రేంజ్ పనుల కోసం బయలుదేరారు. డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడపడం వల్ల మూల మలుపు వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.

ట్రాలీలోని సిమెంట్ స్తంభాల కింద నలిగి కెరమెరికి చెందిన చల్లా అశోక్ (52), పండిత్ రావు (58) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో భీమ్‌రావు, రాము అనే కూలీలు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ సాదిక్ షేక్‌కు స్వల్ప గాయాలయ్యాయి.బాధితులను మొదట కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement