Breaking News

ఆదిలాబాద్ చెత్తసేకరణకు కొత్త విధానం

తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా అమలులోకి వచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) రూల్స్ 2026 ప్రకారం, ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణకు నాలుగు డస్ట్‌బిన్ల (4-Bin System) విధానాన్ని ప్రవేశపెట్టారు.


Published on: 19 Aug 2026 18:35  IST

తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా అమలులోకి వచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) రూల్స్ 2026 ప్రకారం, ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణకు నాలుగు డస్ట్బిన్ల (4-Bin System) విధానాన్ని ప్రవేశపెట్టారు. పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణే లక్ష్యంగా ఈ కొత్త నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు.

ఆకుపచ్చ బుట్ట

వంటగది వ్యర్థాలు

కూరగాయలు, పండ్ల తొక్కలు

మిగిలిపోయిన ఆహార పదార్థాలు, పూలు

నీలం బుట్ట

ప్లాస్టిక్ కవర్లు, సీసాలు

కాగితాలు, కార్డ్‌బోర్డ్ ముక్కలు

గాజు సామాగ్రి, లోహాలు, రబ్బరు

ఎరుపు బుట్ట

వాడిన శానిటరీ ప్యాడ్‌లు, టాంపన్లు

బేబీ డైపర్లు

కండోమ్‌లు, సిరంజీలు, బ్లేడ్‌లు

నలుపు బుట్ట

పాత బల్బులు, ట్యూబ్‌లైట్లు

ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత మొబైళ్లు, బ్యాటరీలు

గడువు ముగిసిన మందులు, రసాయనాల సీసాలు

కొత్త విధానంలోని ముఖ్యమైన నియమాలు:

ఇంట్లోనే వేరు చేయడం తప్పనిసరి: చెత్తను వేరు చేయకుండా అన్నింటినీ కలిపి ఒకే బుట్టలో ఇస్తే పారిశుధ్య సిబ్బంది దానిని సేకరించరు.

భారీ జరిమానాలు: నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై లేదా ఖాళీ ప్లాట్లలో చెత్త వేసే వారికి ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధిస్తారు.

ప్లాస్టిక్ నిషేధం: సింగిల్ యూజ్ (ఒక్కసారి మాత్రమే వాడే) ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసుల అమ్మకాలు మరియు వాడకంపై కఠినమైన నిఘా ఉంటుంది.

నిర్మాణ వ్యర్థాల నియంత్రణ: ఇళ్ల నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారబోయడానికి వీల్లేదు. మున్సిపాలిటీ సూచించిన వాహనాల ద్వారానే తరలించాలి.

 

Follow us on , &

ఇవీ చదవండి