Breaking News

రాతిరి జాబు..టెన్షన్ వద్దు బాబు

హైదరాబాద్‌లో రాత్రి పూట ఉద్యోగాలు చేసేవారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది! రాత్రి వేళల్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ సిబ్బంది, మరియు ఇతర ప్రయాణికుల కోసం ప్రత్యేక నైట్ బస్ సర్వీసులను ప్రారంభించబోతున్నారు.


Published on: 25 Aug 2026 18:16  IST

హైదరాబాద్‌లో రాత్రి పూట ఉద్యోగాలు చేసేవారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది! రాత్రి వేళల్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ సిబ్బంది, మరియు ఇతర ప్రయాణికుల కోసం ప్రత్యేక నైట్ బస్ సర్వీసులను ప్రారంభించబోతున్నారు. ఈ సేవలు ఈ వారం ఆగస్టు 29 నుంచి అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి రాత్రి పూట ప్రయాణాల గురించి ఇక ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

నైట్ బస్సుల ముఖ్య వివరాలు:

బస్సుల వేళలు: రాత్రి 10:00 గంటల నుండి తెల్లవారుజామున 5:00 గంటల వరకు ఈ బస్సులు నడుస్తాయి.

ఫ్రీక్వెన్సీ (వ్యవధి): ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 30 నిమిషాల నుండి ఒక గంట వ్యవధిలో బస్సులు అందుబాటులో ఉంటాయి.

రూట్లు: నగరంలోని అత్యంత రద్దీ ఉండే 6 ప్రధాన మార్గాల్లో మొత్తం 30 బస్సులను నడపనున్నారు.

అందుబాటులో ఉండే ప్రధాన రూట్లు:

ప్రస్తుతానికి ప్రతిపాదించిన ముఖ్యమైన నైట్ బస్ రూట్లు ఇవే:

హయాత్‌నగర్జేబీఎస్

కొండాపూర్సికింద్రాబాద్

మేడ్చల్గచ్చిబౌలి

కోటిపటాన్‌చెరు

సికింద్రాబాద్పటాన్‌చెరు

నైట్ షిఫ్ట్ చేసేవారికి సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అందించడానికి, TGSRTC ఈ నిర్ణయం తీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి