Breaking News

ఎమ్యెల్యే దానం నాగేందర్ పైన అనర్హత వేటు

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. సెప్టెంబర్ 18, 2026 (శుక్రవారం) మధ్యాహ్నం ఈ కేసుపై కోర్టు తన తుది సంచలన తీర్పును వెలువరించింది.


Published on: 18 Sep 2026 19:14  IST

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. సెప్టెంబర్ 18, 2026 (శుక్రవారం) మధ్యాహ్నం ఈ కేసుపై కోర్టు తన తుది సంచలన తీర్పును వెలువరించింది.

తీర్పు వివరాలు: ఆయన కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తేదీ అయిన 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం ఆయన స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు కోర్టు పరిగణించింది.

స్పీకర్ నిర్ణయం తిరస్కరణ:దానం నాగేందర్‌ చట్టపరంగా పార్టీ మారలేదంటూ గతంలో అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది.

కేసు నేపథ్యం: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ (BRS) తరఫున గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

పిటిషనర్లు: బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరిన దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

 

Follow us on , &

ఇవీ చదవండి