Breaking News

హైదరాబాద్ లో దారుణం ఇద్దరు కవల పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ లో దారుణం ఒక మహిళ తన ఇద్దరు కవల పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది.


Published on: 14 Oct 2025 10:13  IST

హైదరాబాద్‌లోని బాలానగర్ పరిధిలో పద్మానగర్‌ కాలనీలో అక్టోబరు 14, 2025న ఒక మహిళ తన ఇద్దరు కవల పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మృతురాలు చల్లారి సాయిలక్ష్మి (27), ఆమె రెండేళ్ల కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లష్యత వల్లి.సాయిలక్ష్మి ముందుగా తన పిల్లల గొంతు నులిమి చంపింది. ఆ తర్వాత నివాసముంటున్న మూడు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసిన దాని ప్రకారం, భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీసి ఉండవచ్చు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సాయిలక్ష్మి, ఆమె భర్త అనిల్, వారి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు. పిల్లలను హత్య చేసిన తర్వాత ఆమె మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి