Breaking News

కారు టైరు పేలి, అదుపుతప్పి బైక్‌ను ఢీకొటింది

నల్గొండ జిల్లా నకిరేకల్ పరిధిలో ఈరోజు, నవంబర్ 18, 2025న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. కట్టంగూర్ గ్రామ శివారులోని శ్రీకృష్ణానగర్ హైవేపై ఎక్సైజ్ ఎస్సై ప్రయాణిస్తున్న కారు టైరు పేలి, అదుపుతప్పి ముందున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 

Published on: 18 Nov 2025 10:16  IST

నల్గొండ జిల్లా నకిరేకల్ పరిధిలో ఈరోజు, నవంబర్ 18, 2025న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. కట్టంగూర్ గ్రామ శివారులోని శ్రీకృష్ణానగర్ హైవేపై ఎక్సైజ్ ఎస్సై ప్రయాణిస్తున్న కారు టైరు పేలి, అదుపుతప్పి ముందున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోని శ్రీకృష్ణానగర్ హైవే.హైదరాబాద్ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న ఎక్సైజ్ ఎస్సై కారు టైరు పేలడం వల్ల అదుపుతప్పి ఈ సంఘటన జరిగింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నకిరేకల్ ఎక్సైజ్ ఎస్సై భానుప్రకాష్, అతని భార్య ప్రియాంక, కుమార్తెతో పాటు, బైక్‌పై వెళ్తున్న చందంపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాలడుగు అంజయ్య, రేణుకలకు గాయాలయ్యాయి. ఎస్సై కుమార్తెకు స్వల్ప గాయాలవగా, మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు, ఇతర వాహనదారులు గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సంఘటనపై నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి