Breaking News

మద్యం మత్తులో కారును నడుపుతూ విధ్వంసం

కాగజ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటనలో, ఒక యువకుడు మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ విధ్వంసం సృష్టించాడు.


Published on: 18 Nov 2025 14:32  IST

కాగజ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటనలో, ఒక యువకుడు మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ విధ్వంసం సృష్టించాడు. కాగజ్‌నగర్‌లోని అంబేద్కర్‌ చౌక్ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన.దుర్గం రాహుల్‌ (23) అనే యువకుడు మద్యం సేవించి (బ్రెత్ అనలైజర్‌లో 99 mg ఆల్కహాల్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది) కారును వేగంగా నడుపుతూ అంబేద్కర్‌ విగ్రహం బేస్‌మెంట్‌ను, విద్యుత్ స్తంభాన్ని, మరియు అక్కడ పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు.టౌన్ ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసి, నిందితుడిని, వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.మద్యం సేవించి వాహనం నడపవద్దు ఇది చట్టరీత్యా నేరం, మీ జీవితానికే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం.అతివేగాన్ని నివారించండి వేగ పరిమితులను పాటించండి మరియు రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా నెమ్మదిగా డ్రైవ్ చేయండి.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పూర్తి దృష్టిని రోడ్డుపైనే కేంద్రీకరించండి.

Follow us on , &

ఇవీ చదవండి