Breaking News

ఐకేపీ వడ్ల కేంద్రాలలో కోట్లారూపాయల అక్రమాలు

హనుమకొండ జిల్లాలో ఐకేపీ (I K P) వడ్ల కొనుగోలు కేంద్రాలలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ముగ్గురు వ్యవసాయ అధికారులను వ్యవసాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు నవంబర్ 19, 2025న జారీ అయ్యాయి.

Published on: 19 Nov 2025 12:15  IST

హనుమకొండ జిల్లాలో ఐకేపీ (I K P) వడ్ల కొనుగోలు కేంద్రాలలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ముగ్గురు వ్యవసాయ అధికారులను వ్యవసాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు నవంబర్ 19, 2025న జారీ అయ్యాయి. 

గత రబీ సీజన్‌లో శాయంపేట, కాట్రపల్లి గ్రామాల్లోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.వడ్లు లేకుండానే ఉన్నట్లుగా ట్రక్ షీట్లు రాసి, ఆన్‌లైన్ ఎంట్రీలు చేయడం మరియు నకిలీ రైతులను సృష్టించి ఈ అక్రమాలకు పాల్పడ్డారు.విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.ఈ స్కామ్‌లో మండల వ్యవసాయ అధికారి (MAO) గంగాజమున, శాయంపేట క్లస్టర్ ఏఈవో (AEO) అర్చన, నేరేడుపల్లి క్లస్టర్ ఏఈవో సుప్రియ భాగస్వాములుగా తేలింది. వారి నిర్లక్ష్యంపై వచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి గత నెలలోనే 21 మందిపై శాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. 

Follow us on , &

ఇవీ చదవండి